Chiranjeevi, Prabhas, Ramcharan

ఇటు అల్లూరి, అటు బాహుబలి… మధ్యలో సైరా!

సైరా హిందీ టీజర్ రిలీజ్ కోసం ముంబయి వెళ్లిన చిరంజీవి, రామ్ చరణ్
సాహో ప్రమోషన్స్ కోసం ముంబయిలోనే ఉన్న ప్రభాస్
చిరంజీవితో రామ్ చరణ్, ప్రభాస్ ఫొటోలు
తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి ఓ శిఖరం. ఇక యువ హీరోల్లో ప్రభాస్, రామ్ చరణ్ అగ్రశ్రేణిలో ఉంటారు. బాహుబలితో ప్రభాస్ అంతర్జాతీయ క్రేజ్ సంపాదించుకోగా, ఆర్ఆర్ఆర్ చిత్రంలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రతో రామ్ చరణ్ మరో బ్లాక్ బస్టర్ కోసం ఉరకలేస్తున్నాడు. ఇక చిరు గురించి చెప్పాల్సి వస్తే ఆయన సైరా నరసింహారెడ్డితో తన స్టామినా చాటేందుకు తహతహలాడుతున్నారు. వీరు ముగ్గురూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే సినీ అభిమానులకు అంతకుమించిన కనుల పండుగ ఇంకేముంటుంది?

సైరా హిందీ టీజర్ రిలీజ్ కోసం చిరంజీవి, రామ్ చరణ్ ముంబయి రాగా, ప్రభాస్ కూడా సాహో ప్రమోషన్ కార్యక్రమాల కోసం అదే సమయంలో అక్కడే ఉన్నాడు. ఇంకేముంది, చిరంజీవిని చూడగానే ప్రభాస్ గౌరవభావంతో విష్ చేయగా, చిరంజీవి ఎంతో ఆప్యాయంగా దగ్గరకి తీసుకుని ముచ్చటించారు. ఇక తనయుడు రామ్ చరణ్ ఓవైపు, ప్రభాస్ మరోవైపు నిలుచిన ఉండగా మెగాస్టార్ ఫొటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Tags: Chiranjeevi, Prabhas, Ramcharan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *