ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఎన్నికల సర్వే: ఏపీ జగన్ దే... ఎన్డీఏకు పూర్తి మెజారిటీ.. రాష్ట్రాల వారీగా అంచనాలివి!

ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎన్నికల సర్వే: ఏపీ జగన్ దే… ఎన్డీఏకు పూర్తి మెజారిటీ.. రాష్ట్రాల వారీగా అంచనాలివి!

ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 295 సీట్లను గెలుచుకోనుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే పేర్కొంది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నదని అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 127 సీట్లు వస్తాయని, ఇతరులకు 121 సీట్లు రావచ్చని ఈ సర్వే వెల్లడించింది.

ఇక రాష్ట్రాల వారీగా అంచనాలను పరిశీలిస్తే…
ఉత్తరప్రదేశ్ లో మొత్తం స్థానాలు 80 కాగా, బీజేపీ 46, బీఎస్పీ 13, సమాజ్ వాదీ 15, కాంగ్రెస్ 4, ఆర్ఎల్డీ 1, అప్నాదళ్ 1 స్థానాల్లో గెలవవచ్చు.
ఉత్తరాఖండ్ లో 5 సీట్లుండగా, బీజేపీ 4, కాంగ్రెస్ 1.
రాజస్థాన్ లో 25 సీట్లుండగా, బీజేపీ 19, కాంగ్రెస్ 6.
పశ్చిమ బెంగాల్ లో 42 సీట్లుండగా, తృణమూల్ కాంగ్రెస్ 29, బీజేపీ 12, కాంగ్రెస్ 1.
ఒడిశాలో 21 సీట్లుండగా, బిజూ జనతాదళ్ 13, బీజేపీ 7, కాంగ్రెస్ 1.
మధ్యప్రదేశ్ లో 29 సీట్లుండగా, బీజేపీ 23, కాంగ్రెస్ 6.
ఛత్తీస్ గఢ్ లో 11 సీట్లుండగా, కాంగ్రెస్ 6, బీజేపీ 5.
పంజాబ్ లో 13 సీట్లుండగా, కాంగ్రెస్ 10, ఆకాలీదళ్ 3.
హర్యానాలో 10 సీట్లుండగా, కాంగ్రెస్ 1, బీజేపీ 9.
బీహార్ లో 40 సీట్లుండగా, బీజేపీ 15, ఆర్జేడీ 5, జేడీ (యూ) 13, కాంగ్రెస్ 2, ఎల్జేపీ 3, ఆర్ఎస్ఎల్పీ 1, వీఐపీ 1.
జార్ఖండ్ లో 14 సీట్లుండగా, బీజేపీ 9, జేఎంఎం 2, కాంగ్రెస్ 2, ఏజేఎస్యూ 1.
గుజరాత్ లో 26 సీట్లుండగా, బీజేపీ 24, కాంగ్రెస్ 2.
హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లుండగా, బీజేపీ 3, కాంగ్రెస్ 1.
మహారాష్ట్రలో 48 సీట్లుండగా, బీజేపీ 21, శివసేన 15, కాంగ్రెస్ 6, ఎన్సీపీ 6.
గోవాలో 2 సీట్లుండగా, బీజేపీ 1, కాంగ్రెస్ 1.
తమిళనాడులో 39 సీట్లుండగా, డీఎంకే 16, అన్నాడీఎంకే 10, కాంగ్రెస్ 4, బీజేపీ 1, పీఎంకే 2, ఇతరులు 6.
ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లుండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20, టీడీపీ 5.
తెలంగాణలో 17 సీట్లుండగా, టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఏఐఎంఐఎం 1.
కర్ణాటకలో 28 సీట్లుండగా, బీజేపీ 16, కాంగ్రెస్ 10, జేడీ (ఎస్) 2.
జమ్మూ కాశ్మీర్ లో 6 సీట్లుండగా, బీజేపీ 2, ఎన్సీ 3, కాంగ్రెస్ 1.
ఆసోంలో 14 సీట్లుండగా, బీజేపీ 6, ఏఐయూడీఎఫ్ 2, కాంగ్రెస్ 4, ఇతరులు 2.
ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 11 సీట్లుండగా, బీజేపీ 6, కాంగ్రెస్ 1, ఎన్సీపీ 2, ఎన్డీపీపీ 1, ఎస్డీఎఫ్ 1.
ఢిల్లీలో 7 సీట్లుండగా, బీజేపీ 7.
కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 సీట్లుండగా, బీజేపీ 4, కాంగ్రెస్ 2.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *