ఆ బంపర్ ఆఫర్ చిరు నయనతారకే ఇస్తున్నారా…!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రాయలసీమకు చెందిన మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న “సైరా” ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. హీరో రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సోషల్ డ్రామాలో నటిస్తున్న నేపథ్యంలో హీరోయిన్ గా నయన తారనే కొరటాల శివ నిర్ణయించారని సమాచారం.

కొరటాల శివ, చిరంజీవి కాంబినేషన్ లో రానున్న ఈ మూవీలో లీడ్ హీరోయిన్ గా ఎవరు చేయనున్నారు అనే విషయం పై అనేక ఊహాగానాలు కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకదశలో దాదాపు శ్రుతీహాసన్ ని ఖరారు చేశారు అని వార్తలు వచ్చినా అందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నయన తారనే తీసుకోవాలని చిరంజీవి,కొరటాల భావిస్తున్నారట. ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం సంధర్బంగా పూజా కార్యక్రమంతో ప్రారంభం కానున్న ఈ చిత్రం, సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. “సైరా” చిత్రం లో నయన తార చిరంజీవి భార్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags: syeraa narasimha reddy, nayanatara, shruthi hassan, konidala productions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *