ఆర్టీసే జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ

  • ఆర్టీసే జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ
  • 10 రోజుల కార్యాచరణ సిద్ధం
  • నిరసన కార్యక్రమాల్లోకి కార్మికుల కుటుంబసభ్యులు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు, పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భేటీ అయిన ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు తమ కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టే అన్ని కార్యక్రమాలకు మద్దతు ప్రకటించాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను విధులకు రావద్దని కోరారు. బస్సులో ప్రయాణించేవారికి టికెట్లు ఇచ్చి, ఆర్టీసీకి మరింత నష్టం చేకూరకుండా వ్యవహరించాలని సూచించారు. 23వ తేదీన ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లను వివరించాలని నిర్ణయించారు.

26న ఆర్టీసీ కార్మికులు పిల్లలతో ధర్నా చేయనున్నారు. 27న ఆర్టీసీ కుటుంబసభ్యులతో కలసి వామపక్ష నేతలు, కార్యకర్తలు కుటుంబాలు భోజనాలు చేయనున్నారు. 28, 29న నిరసన ప్రదర్శలను చేపట్టనున్నారు. 30న సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు 10 రోజుల కార్యాచరణను సిద్ధం చేశారు.
Tags: TSRTC, Strike, rtc jac meetings, action plan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *