ఆరోగ్య శ్రీ కొత్త రూల్స్.. మధ్యతరగతికి బంపరాఫర్

ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ మార్గ దర్శకాలు
వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి పథకం వర్తింపు
గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులూ అర్హులే

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తూ వైసీపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ పథక విస్తరణకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ రోజు విడుదల చేసింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ఒక కారు ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. అయితే, కుటుంబంలో ఒక కారు కన్నా ఎక్కువగా ఉంటే పథకానికి అనర్హులు.

అన్ని రకాల రేషన్ కార్డులు, వైఎస్సార్ పింఛన్ కార్డు, జగనన్న విద్య అర్హత ఉన్న కుటుంబాలూ ఈ పథకానికి అర్హులు. అలాగే, ఆరోగ్యశ్రీ ప్రయోజనాలను 12 ఎకరాల కన్నా తక్కువ మాగాణీ లేక 35 ఎకరాల కన్నా తక్కువ మెట్ట భూమి ఉన్న భూ యజమానులూ పొందొచ్చు. ప్రభుత్వ రంగంలో పని చేస్తూ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
Tags: Jagan, YSRCP, Andhra Pradesh, arogyasree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *