ఆప్ తో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ

ఆప్ తో పొత్తు పెట్టుకోకపోవడానికి కారణం ఇదే: రాహుల్ గాంధీ

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ ల మధ్య పొత్తు కుదరని సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తొలి సారి స్పందించారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని… కానీ ఢిల్లీలోని పార్టీ శ్రేణులు మాత్రం పొత్తులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కారణం వల్లే ఢిల్లీలో కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగబోతోందని చెప్పారు. అయితే, జాతీయ స్థాయిలో కూటమి, పొత్తులు మాత్రం ఉంటాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *