ఆంధ్రజ్యోతి రాధాక్రిష్ణకు గట్టి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం..!

ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, అవినీతిని నిర్మూలించే పనిలో జగన్ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో కృష్ణా నది కరకట్టపై సుమారు 9 కోట్లు వెచ్చించి ప్రభుత్వ కార్యకాలాపాలకు, పార్టీ సమావేశాల నిమిత్తం ప్రజావేదికను నిర్మించారు. అయితే ఈ ప్రజావేదిక అక్రమ కట్టడం అని దానిని కూల్చేయించారు జగన్
అయితే గత వారం రోజులుగా ఏపీ రాజకీయాలలో మారుమోగిన అక్రమ కట్టడం ప్రజావేదిక నేలమట్టం అయిపోయింది. అయితే ఇక కృష్ణా నది కరకట్టపై మిగిలిన అక్రమ కట్టడాల పని పట్టేందుకు రెడీ అవుతుంది ఏపీ ప్రభుత్వం. అందులోనే భాగంగా చట్టాలను ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) నోటీసులు జారీ చేసింది. అయితే తాజాగా ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాధాక్రిష్ణకు కూడా గట్టి షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

అయితే తెలుగుదేశం ప్రభుత్వపాలనాకాలంలో తూర్పుగోదావరి జిల్లాలోని పాలచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 208/5-ఎ లో ప్రింటింగ్‌ ప్రెస్‌ భవన నిర్మాణాన్ని ఆంధ్రజ్యోతి యాజమాన్యం గతేడాది 1.75 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టింది. అయితే దీని నిర్మాణం కోసం డిస్ట్రిక్ట్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) అధికారుల నుంచి కనీ గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఆ భవానాన్ని నిర్మించారు. అయితే ఆ భవనం కూడా నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మించడం, అనుమతులు లేకపోవడంతో అక్రమ కట్టడంగా గుర్తించిన ప్రభుత్వం గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమార్తె వేమూరి అనూషకు నోటీసులు జారీ చేసింది. అక్రమ కట్టడంపై వారం రోజులలో పూర్తి నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవలసి ఉంటుందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *