అసలే అసురన్ రీమేక్….వెంకీకి ఎంటీ షాకులు..?

తమిళ స్టార్ హీరో ధనుష్ కోలీవుడ్ లో తాజాగా నటించిన సినిమా అసురన్. ఈ సినిమా రీసెంట్‌గా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కమర్షియల్ సక్సస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు సొంతం చేసుకున్నారని.. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించే ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది. వాస్తవంగా ముందు ఈ సినిమాకి తమిళ డైరెక్టరే దర్శకత్వం వహిస్తాడని అన్నారు. ఆ తర్వాత కూడా టాలీవుడ్ లో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చేతిలో ఏ సినిమా లేని శ్రీకాంత్ అడ్డాలని ఫైనల్ చేశారట.
అసురన్ సినిమాని పక్కాగా తెలుగులో రీమేక్ చేయగల దర్శకుడు ఎవరున్నారు అంటూ నిర్మాత డి.సురేష్ బాబు అన్వేషణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలుగు రీమేక్ ని తెరకెక్కించే దర్శకుల పేర్లు రోజుకొకటి చొప్పున వినిపించడం మొదలైంది. ఇటీవల హను రాఘవపూడి పేరు ప్రధమంగా వినిపించింది. ఈ వార్తలు విన్న సురేష్ బాబు ఫైనల్ గా ఈ సినిమా రీమేక్ ని తెరకెక్కించే దర్శకుడి పేరుని ఫైనల్ చేసేశారు.

శ్రీకాంత్ అడ్డాలను దర్శకుడిగా కన్ ఫామ్ చేస్తూ మీడియా వర్గాలకు డి.సురేష్ బాబు ప్రాజెక్ట్ వివరాల్ని అఫీషియల్ గా వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనని కూడా వెల్లడించబోతున్నామని.. ఈ సబ్జెక్ట్ కు శ్రీకాంత్ అడ్డాల అయితేనే బాగుంటుందని.. వెంకటేష్-నేను నిర్ణయించుకున్నామని తెలిపారు. తమిళ మాతృక కథలో ఫ్లేవర్ ఎక్కడా తగ్గకుండా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. అయితే తెలుగు వెర్షన్ లో కులాల ప్రస్థావన మాత్రం తగ్గిస్తామని ఈ సందర్భంగా సురేష్ బాబు వెల్లడించినట్లు తాజా సమాచారం. అయితే ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల ఎంతవరకు బెటర్ ఛాయిస్ అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల ఇప్పటి వరకు తీసిన కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోతవం.. సినిమాలు కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా తెరకెక్కించాడు. మరి ఈ మాస్ సినిమాకి ఎంతవరకు న్యాయం చేస్తాడు..! అని అనుకుంటున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *