అలా చేస్తే జగన్‌కు నేను మద్దతిస్తా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అలా చేస్తే జగన్‌కు నేను మద్దతిస్తా.. పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని, భవన నిర్మాణ కార్మికుల విషయంలో జగన్‌ను టార్గెట్ చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి అంగీకరించలేదా అని ప్రశ్నించారు పవన్. అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారని.. ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రతిపక్షనేత చంద్రబాబుపై కోపంతో నిర్మాణాలు ఆపేశారని ధ్వజమెత్తారు. రాజధానికి అన్ని భూములు అవసరం లేదనుకుంటే.. 30 వేల ఎకరాల్లో కాకుండా 5 వేల ఎకరాల్లో రాజధాని కట్టొచ్చన్నారు. రాజధానిపై జగన్ సర్కార్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే మంచిదన్నారు.

ఇక జగన్ రాజధాని పులివెందులలో పెట్టాలనుకుంటే.. ప్రజామోదంతో అదైనా చేయొచ్చన్నారు జనసేనాని. తాము కూడా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమంటూ చురకలంటించారు పవన్. తాను మాట్లాడితే శాపనార్దాలు పెడతానని అంటున్నారని.. తాను వ్యక్తిగతంగా ఎవర్నీ విమర్శించనని.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 మంది కార్మికులు చనిపోతే మాట్లాడకుండా ఉండాలా అంటూ ప్రశ్నించారు.

ప్రజలను చంపేస్తుంటే మేం మౌనంగా ఉండిపోవాలా.. పవన్. వైఎస్సార్‌సీపీకి 151 సీట్లు ఇచ్చినందుకు ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారు. కొత్త పాలసీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని.. భవన నిర్మాణ కార్మికుల ఆకలి ప్రభుత్వానికి తెలిపేందుకు డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పారు జనసేన అధినేత.
Tags: ys jagan, pawan kalyan, ysrcp party, amaravathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *