అపరిశుభ్ర వాతావరణంలో జొమాటో బ్యాగులు.. లక్ష రూపాయల జరిమానా

చెన్నైలో పెరుగుతున్న డెంగీ కేసులు
నివారణ చర్యలు చేపట్టిన అధికారులు
అపరిశుభ్రంగా ఉన్న కార్యాలయాలు, సంస్థలకు జరిమానాలు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. చెన్నైలో ఇటీవల డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. అపరిశుభ్రంగా కనిపించిన సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చేట్‌పెట్‌ ఎంసీ నికల్సన్‌ రోడ్డులోని ఓ భవనంలో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో బ్యాగులను గుర్తించిన అధికారులు ఆ సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించారు.
Tags: zomato bag, chennai corporation, fine 1 lack, dengue

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *