‘అగ్రిగోల్డ్’పై చంద్రబాబు మరోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

‘అగ్రిగోల్డ్’పై చంద్రబాబు మరోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

యూ-టర్న్ బాబు మరోసారి మోసం చేశారు
అగ్రిగోల్డ్ ఆస్తులను పచ్చ నాయకులు లాగేసుకున్నారు
బీజేపీ ధర్నాలతో నిలదీస్తే రూ.250 కోట్లే ఇచ్చారు
రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఏపీ ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంపై యూ టర్న్ సీఎం చంద్రబాబు మరోసారి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని విమర్శించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పచ్చ నాయకులు పూర్తిగా లాగేసుకున్నారన్నారు. బాధితుల పక్షాన పోరాడుతూ, వారికి న్యాయం చేయాలని ఏపీ వ్యాప్తంగా బీజేపీ ధర్నాలతో నిలదీస్తే, రూ.250 కోట్లు మాత్రమే ఇచ్చి యూ-టర్న్ బాబు మరోసారి మోసం చేశారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *